
శిక్షణను వినియోగించుకోవాలి
ఎర్రవల్లి: ఉపాధ్యాయులు శిక్షణను వినియోగించుకోవాలని.. ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశాన్ని కూడా పాఠశాలలో తప్పకుండా అమలు చేయాలని ఆర్‌జేడీఎస్‌ఈ అసిస్టెంట్ డైరెక్టర్, ప్రోగ్రాం స్టేట్ అబ్జర్వర్ విష్ణుశాస్త్రి అన్నారు. శుక్రవారం మండలంలోని కొండేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి ఇటిక్యాల మండలంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు కెపాసిటీ బిల్డింగ్‌పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన కార్యక్రమాన్ని పర్యవేక్షించి పాఠశాలల్లో చేపట్టాల్సిన పలు అంశాలను గురించి ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ప్రతి పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి బెస్ట్ ప్రాక్టీస్‌లను చర్చించి వాటిని ఇతర పాఠశాలల్లో కూడా అమలు చేయాలని సూచించారు. అనంతరం ఐదు రోజుల ఉపాధ్యాయుల కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంలో ఆబ్జెక్టివ్, ఇంప్లిమెంటేషన్ ల గురించి డీఆర్పీలు వివరించారు. కార్యక్రమంలో ఎఎంఓ ఎస్తేర్ రాణి, ఎంఈఓలు అమీర్‌ఫాష, వెంకటేశ్వర్లు, డిఆర్పీలు, ఆర్పీలు, తదితరులు ఉన్నారు.