పచ్చదనమే ప్రగతికి నిదర్శనం | - | Sakshi
Sakshi News home page

పచ్చదనమే ప్రగతికి నిదర్శనం

Aug 26 2026 1:06 AM | Updated on Aug 26 2026 1:06 AM

మల్హర్‌: పచ్చదనమే ప్రగతికి నిదర్శనమని అటవీ శాఖ సీసీఎఫ్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని తాడిచర్ల ఓపెన్‌ కాస్ట్‌ ఆవరణలో ఏఎ మ్మార్‌ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీసీ ఎఫ్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, హరిత తెలంగాణ లక్ష్యంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పచ్చదనం పెరిగితేనే భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన గాలి అందుతుందని పేర్కొన్నారు. పరిశ్రమల ఆవరణలో పచ్చదనం పెంపొందించడం అభినందనీయమని వెల్లడించారు. డీఎఫ్‌ఓ కృష్టగౌడ్‌, ఎఫ్‌ఏఓలు అప్పలకొండ, సందీప్‌, డీఎస్పీ సూర్యనారాయణ, ఏఎమ్మార్‌ సేఫ్టీ మేనేజర్‌ సురేష్‌బాబు, తాడిచర్ల సర్పంచ్‌ స్వామి, ఉప సర్పంచ్‌ రాజు పాల్గొన్నారు.

సీసీఎఫ్‌ ప్రభాకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement