ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి

Jul 28 2026 1:24 AM | Updated on Jul 28 2026 1:24 AM

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

ప్రజాదివస్‌లో 12 ఫిర్యాదులు స్వీకరణ

భూపాలపల్లి అర్బన్‌: ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్‌ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 12 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ, ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విని సంబంధిత పోలీస్‌ స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలతో మాట్లాడారు. అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి పైరవీలు లేదా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధంగా ప్రతీ ఒక్కరికి న్యాయం జరిగేలా పోలీస్‌ శాఖ పనిచేస్తోందిన ప్రజలకు చేరువగా ఉండి శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజాదివాస్‌ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. సత్వర, పారదర్శకమైన పోలీస్‌ సేవలు అందించేందుకు జిల్లా పోలీస్‌ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement