రామప్ప సాగునీటిపై సందిగ్ధం.. | - | Sakshi
Sakshi News home page

రామప్ప సాగునీటిపై సందిగ్ధం..

Jul 28 2026 1:24 AM | Updated on Jul 28 2026 1:24 AM

వెంకటాపురం(ఎం): రామప్ప సరస్సు నుంచి ఆయకట్టు పొలాలకు అందించే సాగునీటిపై సందిగ్ధం నెలకొంది. రామప్ప సరస్సు కింద అధికారికంగా 5,180 ఎకరాలు, అనధికారికంగా మరో 5 వేల ఎకరాల వరిపంట సాగువుతుంది. వానాకాలం సాగు కోసం గత నెల 29న పాలంపేట రైతు వేదికలో ఇరిగేషన్‌ అధికారులు రైతులతో సమావేశం నిర్వహించి సరస్సు కింద పూ ర్తి ఆయకట్టు సాగయ్యేలా తైబందీ ఖరారు చేశారు. పంట పొలాలకు సరస్సు కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేయడంతో రైతులు నార్లు పోసుకొని సుమారు 800 ఎకరాల్లో వరినాట్లు వేశారు. ఎల్‌నినో ప్రభావంతో రామప్ప సరస్సు కింద ఆయకట్టు పొలాలకు సాగునీటి సరఫరాను నిలిపివేయాలని ఉన్నతాధికారుల ఆదేశానుసారంతో ఇరిగేషన్‌ అధికారులు ఈనెల 20న నీటిని నిలిపివేశారు. నారు పోసుకునేందుకు నీరిచ్చి నాట్లు వేసుకునేందుకు నీరు ఎందుకు ఇవ్వరంటూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పెద్దమొత్తంలో ఆయకట్టు రై తులు ఆందోళనకు దిగారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఆయకట్టు రైతులకు బీఆర్‌ఎస్‌ నా యకులు తప్పుడు సంకేతాలు ఇస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటూ ఈ నెల 24న ఇరిగేషన్‌ అధికారులతో సరస్సు నీటిని ఆయకట్టు పొలాలకు విడుదల చేయించారు.

సరస్సు నీటిని నిలిపివేసిన అధికారులు

ఆందోళనలో ఆయకట్టు రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement