వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ) అధికారులు సోమవారం సందర్శించారు. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఈడీ ఎస్‌కే.గుప్తా, జేఈ చౌదరి, జేజీఎం బాలేందర్ కుమార్, డీజీఎంలు ఉమేష్‌కుమార్, పర్వింద్ర తివారి, వాసీమ్, ఏజీఎం గోపాలకృష్ణ సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు వారికి తీర్థప్రసాదాలు అందించగా ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ వారికి స్వామివారి శేషావస్త్రాలను అందించి శాలువాలతో సత్కరించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకల సంపద బాగుందని వారు కొనియాడారు. అలాగే రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన ఎడ్‌నోల్స్ సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు.


