నీట్‌ ప్రశాంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

నీట్‌ ప్రశాంతంగా నిర్వహించాలి

Apr 28 2026 8:17 AM | Updated on Apr 28 2026 8:17 AM

భూపాలపల్లి: జాతీయ స్థాయిలో ఎంతో ప్రాధాన్యత కలిగిన నీట్‌ పరీక్షను జిల్లాలో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ సూచించారు. నీట్‌ పరీక్ష నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. మే 3వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్‌ పరీక్ష ఉంటుందని తెలిపారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాల రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలలో 374 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని, డిగ్రీ కళాశాలలో 240 మంది, జూనియర్‌ కళాశాలలో 134 మంది హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి జిల్లా స్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కలెక్టర్‌ అధ్యక్షతన అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, డీటీఓ సంధాని, డీఈఓ రాజేందర్‌, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, నోడల్‌ అధికారి రమణారావు, కలెక్టరేట్‌ ఏఓ శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు.

యాంటి డ్రగ్స్‌పై అవగాహనకు కార్యాచరణ..

జిల్లాలో బాలల సంరక్షణ, మహిళా శ్రేయస్సు, యువతలో యాంటీ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన పెంపు లక్ష్యంగా ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో చిల్డ్రన్స్‌ వీక్‌ కార్యక్రమం వాల్‌ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్‌కుమార్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మళ్లీశ్వరి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మధుసూదన్‌, డీఈఓ రాజేందర్‌, ఆర్డీఓ హరికృష్ణ పాల్గొన్నారు.

దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు..

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 73 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల కలెక్టర్‌ విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement