భూపాలపల్లి అర్బన్: బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొడవటంచ ఆలయ
సందర్శన
రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ సెషన్ జడ్ఙి రమేష్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
కాళేశ్వరాలయంలో భక్తుల సందడి
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి కావడంతో ఉదయం 11గంటల లోపు భక్తులు అభిషేక పూజలు, అర్చనలు అధికంగా నిర్వహించారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో దర్శనాలతో పాటు కుంకుమార్చన పూజలు చేశారు. శ్రీసరస్వతి అ మ్మవారిని దర్శించుకున్నారు. శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు నిర్వహించారు. దీంతో భక్తుల సందడి కనిపించింది.
కొనసాగుతున్న
కల్యాణ బ్రహ్మోత్సవాలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు నిత్యాహ్నికం, చతుస్థానార్చన, డోలోత్సవం నిర్వహించారు. ఉదయం అమ్మవారి ఉత్సవమూరిక్తి భద్రపీఠసేవ, సాయంత్రం అశ్వవాహన సేవ నిర్వహించారు. ఉదయం అఖిల భారత పద్మశాలి సంఘం వరంగల్, హనుమకొండ, గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా మేయర్ గుండు సుధారాణి, ప్రభాకర్ దంపతులు, విశిష్ట అతిథిగా కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు, పండ్లు సమర్పించారు. వీరితో పాటు వడ్నాల నరేందర్, ఆడెపు రవీందర్, బచ్చు ఆనందం పాల్గొన్నారు.


