ఈ నెల 20న నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు.
ఈ ఫొటో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తాగునీటి ట్యాప్‌ల వద్ద ప్రదేశం. ఆస్పత్రికి వస్తే రోగాలు పోతాయని అనుకొని వస్తుంటారు. కానీ కొత్త రోగాలు వ్యాప్తి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్‌ఓ ప్లాంట్ పూర్తిగా ధుమ్ముదూళి, బూజుతో నిండిపోయింది. శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో మట్టి పేరుకుపోయింది. మురికి పట్టిన ప్రాంతం నుంచే రోగుల బంధువులు బాటిళ్లలో నీరు తీసుకెళ్తున్నారు.


