అన్న ప్రసాదాలను వినియోగించుకోవాలి
భూపాలపల్లి రూరల్ : సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరంవెళ్లే భక్తులు భూపాలపల్లి మండలం కమలాపురం క్రాస్ రోడ్డులో ఏర్పాటుచేసిన ఉచిత అన్న ప్రసాదాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. ఆరవ రోజు మంగళవారం మధ్యాహ్నం భక్తులకు ఎమ్మెల్యే గండ్ర భోజనాలు వడ్డించారు. అనంతరం భక్తులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరు రోజుల నుంచి పోలీస్, ఐకేర్ హాస్పిటల్ హైదరాబాద్, దాతల సహకారంతో ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఆరు రోజుల నుంచి ఉచిత అన్న ప్రసాదాలను ప్రతిరోజు సుమారు రెండు వేల మందికి అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉచిత అన్న ప్రసాదాల పంపిణీని 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వచ్చిపోయే భక్తులు కమలాపూర్ క్రాస్ రోడ్డు దగ్గర ఆగి భోజనం చేయాలని ఎమ్మెల్యే కోరారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


