ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచే రేషన్‌ సరఫరా చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచే రేషన్‌ సరఫరా చేయాలి

Oct 14 2026 3:59 AM | Updated on Oct 14 2026 3:59 AM

జనగామ రూరల్‌: జిల్లాలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న 57 మంది సివిల్‌ సప్లై హమాలీ కార్మికుల ఉపాధిని పరిరక్షించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ జనరల్‌ మేనేజర్‌ సాయి అరుణ్‌కుమార్‌కు ఆల్‌ హమాలీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజుతో పాటు సంబంధిత హమాలీ కార్మికుల యూనియన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బఫర్‌ గోదాముల నుంచి నేరుగా రేషన్‌ షాపులకు బియ్యం తరలింపు చేపట్టడంతో జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌, కొడకండ్ల పాయింట్లలో పనిచేస్తున్న 57 మంది హమాలీ కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని జనరల్‌ మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లారు. జనరల్‌ మేనేజర్‌ సాయి అరుణ్‌ కుమార్‌ పాయింట్ల ద్వారానే రేషన్‌ బియ్యం సరఫరా కొనసాగిస్తామని, జిల్లాలో జారీ చేసిన సంబంధిత ఉత్తర్వులను రద్దు చేస్తామ ని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ విషయాన్ని జిల్లా మేనేజర్‌కు తెలియజేసి సంబంధిత పాయింట్ల ద్వా రా రేషన్‌ షాపులకు బియ్యం పంపించాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సివిల్‌ సప్లై హమాలీ యూనియన్‌ ప్రతినిధులు బోరెల్లి సోమ య్య, పిట్టల తిరుపతి, బెల్లకూరి చెన్నయ్య, ఎదునూరి భిక్షపతి, ఎల్లంల వెంకన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement