మరో మూడు తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు.. | - | Sakshi
Sakshi News home page

మరో మూడు తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు..

Oct 14 2026 3:59 AM | Updated on Oct 14 2026 3:59 AM

విద్యారణ్యపురి/కాజీపేట : ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు మరో మూడు తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు, అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మొదటి దశలో 9 స్కూళ్లకు గత నెలలోనే అనుమతినిస్తూ నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. రెండో దశలో హనుమకొండ జిల్లా వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గానికి కాజీపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (రూ.10కోట్లు), పరకాల నియోజకవర్గానికి సంబంధించి ఆత్మకూ రు మండలంలోని పెద్దాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లోనే తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు అనుమతినిస్తూ రూ 9.95 కోట్లు నిధులు మంజూరు చేసింది. మహబూబాబాద్‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గానికిగాను పెద్దవంగర మండలం చిట్యాల జెడ్పీహెచ్‌ఎస్‌లో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు అనుమతినిస్తూ రూ.11.40కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న హైస్కూళ్ల భవనాల్లోనే అవసరమైన తరగతి గదులు, ల్యాబ్‌లు, తదితర వసతులు కల్పించనున్నారు. ఇందులో ప్రీ ప్రైమరీనుంచి ఇంటర్‌ వరకు ఇంగ్లిష్‌ మీడియంలోనే విద్య అందిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement