ఐదో రోజు జూనియర్‌ డాక్టర్ల నిరసన | - | Sakshi
Sakshi News home page

ఐదో రోజు జూనియర్‌ డాక్టర్ల నిరసన

Oct 14 2026 3:59 AM | Updated on Oct 14 2026 3:59 AM

జనగామ: సమాన స్టైఫండ్‌ చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌), మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్‌)లో పనిచేస్తున్న 22 మంది ఎఫ్‌ఎంజీ జూనియర్‌ డాక్టర్ల సమ్మె మంగళవారం ఐదో రోజుకు చేరుకుంది. జూనియర్లు విధులు బహిష్కరించి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన తమకు నెలకు రూ.5 వేల స్టైఫండ్‌ మాత్రమే చెల్లిస్తున్నారని, భారతదేశంలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన హౌస్‌ సర్జన్లకు రూ.29,900 చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నేడు లైసెన్స్‌ రిజిస్ట్రేషన్‌ మేళా

జనగామ రూరల్‌: తెలంగాణ రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల (ఫుడ్‌ బిజినెస్‌ ఆపరేటర్లు) కోసం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ రిజిస్ట్రేషన్‌ మేళా ఈనెల 14న(బుధవారం) నిర్వహించనున్నట్లు ఫుడ్‌ సేఫ్టీ అధికారి సీహెచ్‌. వినీల్‌ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో రూమ్‌ నెంబర్‌ జీ 2లో ఉదయం 11:00 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఉంటుందన్నారు. ఆహార వ్యాపార నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని లైసెన్స్‌ రిజిస్ట్రేషన్లు పొందడం లేదా రెన్యువల్‌ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఆహార పరిరక్షణ అధికారి: 73063 35795, గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌: 99858 20544 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు.

మద్యపాన నిషేధ బోర్డుల ఏర్పాటు

రఘునాథపల్లి: మండలంలోని కన్నాయపల్లి గ్రామస్తులు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో ఐదు నెలలుగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం గ్రామ ప్రధాన రహదారిలోని గబ్బెట రోడ్డు, భాంజీపేట రోడ్డు, కోడూర్‌ రోడ్ల వద్ద గ్రామంలో అమలవుతున్న మద్య నిషేధంపై ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈమేరకు సర్పంచ్‌ లోనె అంజమ్మకు గ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు.

పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

జనగామ రూరల్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల శిశు గృహంలో మిషన్‌ వాత్సల్య పథకం కింద ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆరు పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సిలర్‌ 1, చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ 1, స్టోర్‌ కీపర్‌ కమ్‌ అకౌంటెంట్‌ 1, పారామెడికల్‌ సిబ్బంది 1, అటెండర్‌ 1, సేవిక 1 పోస్టు చొప్పున మొత్తం ఆరు పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 21 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుందన్నారు. కేర్‌ లీవర్స్‌, అనాథలు, ఒంటరి మహిళలు, నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఇతర బలహీన వర్గాలకు అదనంగా ఐదు మార్కులు కేటాయిస్తారన్నారు. 17వ తేదీ శనివారం ఉద యం 10.00 గంటలకు నెగెటివ్‌ మార్కింగ్‌తో కూడిన రాత పరీక్ష నిర్వహిస్తారన్నారు. అదే రో జు మౌఖిక పరీక్ష నిర్వహించి, ఫలితాలు ప్రకటిస్తారన్నారు. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేట ప్పుడు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను తప్పనిసరి గా తీసుకురావాలన్నారు. దరఖాస్తును ఈనెల 15 సాయంత్రం 5.00 గంటలలోపు కలెక్టరేట్‌లోని ఇన్‌వార్డ్‌లో అందజేయాలన్నారు.

పాడైపోయిన మాంసం సీజ్‌

జనగామ: మున్సిపాలిటీ పరిధిలో ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా అధికారులు తనిఖీలు నిర్వహించి పాడైపోయిన మాంసాన్ని సోమవా రం రాత్రి సీజ్‌ చేశారు. ప్రజలకు విక్రయిస్తే ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉండటంతో సీజ్‌ చేసిన మాంసాన్ని అధికారుల పర్యవేక్షణలో గుంతలో పూడ్చిపెట్టారు. ఈ సందర్భంగా కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. మాంసం కొనుగోలు చేసే సమయంలో దాని తాజాదనం, నాణ్యతను పరిశీలించాలని సూచించారు. అపరిశుభ్రంగా మాంసం విక్రయించే దుకాణాలపై అప్రమత్తంగా ఉండాలని, పాడైపోయిన మాంసం విక్రయాలు గుర్తిస్తే సమాచారం అందించాలని కోరారు. ప్రమాణాలు పాటించకుండా ప్రజారోగ్యానికి హాని కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement