● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
● స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తిలోని
పలుగ్రామాల్లో సందర్శన
స్టేషన్ఘన్పూర్: రైతులు తమ వ్యవసాయ భూముల వద్ద ఫామ్పాండ్ల నిర్మాణం చేయడం ద్వారా ఎంతో ప్రయోజనంగా ఉంటుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మండలంలోని రంగరాయగూడెం గ్రామంలో వీబీ జీరామ్జీ పథకం కింద చేపట్టిన ఫామ్పాండ్స్ నిర్మాణ పనులను కలెక్టర్ సోమవారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫామ్పాండ్స్ నిర్మాణం ప్రభుత్వ స్థలంలో చేపడుతున్నారా? రైతుల సొంత భూముల్లో చేస్తున్నారా తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన రైతు మందపురం ఎల్లాగౌడ్ తన పొలంలో ఫామ్పాండ్ నిర్మించగా దానిని పరిశీలించారు. రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉందని, ఫామ్పాండ్ నిర్మాణం వల్ల రైతుకు కలిగే ప్రయోజనాలను రైతును అడిగి తెలుసుకున్నారు. తన బోరులో సరిపడా నీరు అందుబాటులో ఉందని, బావిలో నీటికొరత లేకపోవడంతో పాటు నీటి మట్టం కూడా పెరిగిందని రైతు కలెక్టర్కు తెలిపారు. ఆయన వెంట డీఆర్డీఓ భాస్కర్, అదనపు డీఆర్డీఓ పి.సూరి, ఎంపీడీఓ విజయశ్రీ, సర్పంచ్ శిరీష్రెడ్డి, ఏపీఓ ప్రేమయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ కవితఎల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తిలో..
పాలకుర్తి టౌన్: ఫామ్పాండ్ల నిర్మాణాలను నిబంధనల ప్రకారం చేపట్టి, పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రం, అయ్యంగారిపల్లి, ఈరవెన్ను గ్రామాల్లో ఫామ్పాండ్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. డీఆర్డీఓ భాస్కర్, ఎంపీడీఓ వేదవతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


