న్యూస్‌రీల్
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెబాట
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు నేటినుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు.
మా ప్రచురణ
నామినేటెడ్ పోస్టులకు పోటాపోటీ
● మండలాల వారీగా భారీగా ఆశావహులు
● ఒక్కో పదవికి తీవ్ర పోటీ
● పీఏసీఎస్, మార్కెట్ కమిటీలు, దేవస్థానాలు,
● రాష్ట్ర కార్పొరేషన్ పదవులపై ఆశలు
మంగళవారం శ్రీ 13 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తికావొస్తున్నా నామినేటెడ్ పదవుల భర్తీపై స్పష్టత లేకపోవడంతో జిల్లాలో ఆశావహుల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. పీఏసీ ఎస్‌లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవస్థానాలు, గ్రంథాలయ సంస్థలు, కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దసరా లేదా ఆ తర్వాత పదవుల భర్తీ ఉండవచ్చన్న ప్రచారంతో ఆశావహుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది.
ఒక్కో పదవికి భారీగా..
జిల్లా కేంద్రం నుంచి కంచె రాములు, వంగాల మల్లారెడ్డి, కొత్త కరుణాకర్‌రెడ్డి, బనుక శివరాజ్ యాదవ్, మేడ శ్రీనివాస్, ఎండీ అన్వర్ వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, జమాల్ షరీఫ్, చింతకింది మల్లేశం, లింగాల నర్సిరెడ్డి, మాజిద్ అప్సర్ నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవులకు బానోత్ రాజేష్ నాయక్, అన్నం బ్రహ్మారెడ్డి, తీగల కరుణాకర్‌రావు, మంచాల ఎల్లయ్య, జిల్లా నామినేటెడ్ పదవికి అన్నెబోయిన భిక్షపతి ప్రయత్నిస్తున్నారు. జనగామ మార్కెట్ కమిటీకి లింగాల జగదీష్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోసం మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి ఆశిస్తుండగా, బుషిగంపల ఉపేందర్, ఆంజనేయులు, తాటిపాముల రమేశ్, మార్పు శ్రీనివాస్ రెడ్డి పీఏసీఎస్ చైర్మన్ రేసులో ఉన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎడ్ల వెంకటస్వామి, ఇల్లందుల శ్రీనివాస్, మారేపల్లి ప్రభాకర్, గాదెపాక సుధాకర్‌బాబు, పీఏసీఎస్ చైర్మన్ పదవికి బెలిదె వెంకన్న, నాగరబోయిన శ్రీరాములు, బేతి జైపాల్‌రెడ్డి, పోగుల సారంగపాణి పోటీలో ఉన్నారు. అదే ప్రాంతం నుంచి సింగపురం వెంకటయ్య, జీడి రమేశ్ కుమార్, చేపూరి వినోద్, చిల్పూర్ నుంచి గడ్డమీద సురేష్ కూడా పోటీలో ఉన్నారు.
మీ సృజన..
దేవరుప్పుల పీఏసీఎస్ చైర్మన్‌గా కాసర ధర్మారెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. కొడకండ్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవి దేవరుప్పుల మండలానికి కేటాయిస్తారన్న సమాచారంతో రుద్రోజు భాస్కరాచారి, తోటకూరి పాండు కృష్ణ, బోనగిరి యాకస్వామి, రెడ్డి రాజుల రమేశ్, కాడబోయిన గణేష్ ఆశిస్తున్నారు. రఘునాథపల్లి నుంచి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి మారుజోడు రాంబాబు, కంచనపల్లి పీఏసీఎస్ కు మేకల నరేందర్, కోళ్ల రవి గౌడ్, నిడిగొండ పీఏసీఎస్‌కు గంగిడి నరసింహారెడ్డి, మాసంపల్లి లింగాజీ, గొట్టం భాస్కర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. చిల్పూర్ కొత్త పీఏసీఎస్ చైర్మన్ పదవికి చిర్ర నాగరాజుగౌడ్, బొమ్మిశెట్టి బాలరాజు, ఎడవల్లి మల్లారెడ్డి, చిల్పూర్ బుగులు వెంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్ పదవికి పొట్లపల్లి శ్రీధర్‌రావు పోటీలో ఉన్నారు. కొడకండ్లలో రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులకు దరావత్ సురేష్ నాయ క్, ధరావత్ రాజేష్ నాయక్, ఈరంటి సాయికృష్ణ, సొసైటీ చైర్మన్ పదవికి కీసర సునీల్‌రెడ్డి, నెమరుగమ్ముల వెంగళరావు, దేశగాని నాగరాజు, ధర్మారపు భిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్‌న పదవికి ధర్మారపు భిక్షపతి, దంతాలపల్లి రవి పేర్లు వినిపిస్తున్నాయి. నర్మెట–తరిగొప్పుల ఉమ్మడి పీఏసీఎస్ చైర్మన్ పదవికి బైరగోని అంజయ్య, భూస అంజయ్య, ఫరీదుల యాదయ్య, బానోత్ బాల్‌సింగ్, తరిగొప్పుల నుంచి వగలబోయిన యాదగిరి ఆశిస్తున్నారు. కొమురవెల్లి దేవస్థానం చైర్మన్‌గా గంగం నరసింహారెడ్డి తిరిగి అవకాశం కోరుతున్నట్లు సమాచారం. జనగామ పీఏసీఎస్ చైర్మన్ పదవికి నిమ్మతి మహేందర్‌రెడ్డి, సుంకరి శ్రీనివాస్‌రెడ్డి, చెంచారపు బుచ్చిరెడ్డి, చీటకోడూరు పీఏసీఎస్‌కు దూడల సిద్ధయ్య పేర్లు వినిపిస్తున్నాయి. జనగామ పీఏసీఎస్‌లో గతంలో చైర్మన్‌గా పనిచేసిన మహేందర్‌రెడ్డికి మరోసారి అవకాశం దక్కవచ్చన్న ప్రచారం ఉంది. బచ్చన్నపేట పీఏసీఎస్ చైర్మన్ పదవికి మాసాపేట రవీందర్‌రెడ్డి, జిల్లా సందీప్, జంగిటి విద్యనాథ్, పిన్నింటి కావ్యశ్రీరెడ్డి, దత్రపు నరేష్, బండకింది హరిబాబు పోటీపడుతున్నారు. పాలకుర్తి చాకలి ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పదవికి లావుడియా మంజుల, కమ్మగాని నాగయ్య, వీరమనేని యాకాంతారావు, అనుముల మల్లారెడ్డి ఆశిస్తున్నారు. పాలకుర్తి రైతు సేవాసహకార సంఘం చైర్మన్‌గా గిరగాని కుమారస్వామి, తొర్రూరు పీఏసీఎస్ చైర్మన్‌గా బక్క పుల్లయ్య, పాలకుర్తి దేవస్థానం చైర్మన్‌గా రాపాక సత్యనారాయణ, వల్మిడి దేవస్థానం చైర్మన్‌గా పాలెపు సత్తయ్య పేర్లు ఖరారైనట్లు ప్రచారం ఉంది. రాష్ట్ర కార్పొరేషన్‌న్ డైరెక్టర్ బరిలో మొలుగూరి యాకయ్య గౌడ్, పులి గణేష్‌గౌడ్ ఉన్నారు. పార్టీ కోసం దీర్ఘకాలంగా పని చేసిన తమకు పదవులు ఇవ్వాలని పలువురు నాయకులు కోరుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ ఇన్‌చార్జ్‌ల ద్వారా అధిష్టానం మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


