విద్యారణ్యపురి: మలేసియాలోని కౌలాలాంపూర్ మీడ్ వ్యాలీలో ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగిన కామన్‌వెల్త్ ఇంటర్నేషనల్ స్కూల్ చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో హనుమకొండకు చెందిన లావుడ్య అక్షత్ చౌహాన్ పలు విభాగాల్లో ప్రతిభ చాటి మెడల్స్ సాధించాడు. ర్యాపిడ్, బ్లిట్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్, క్లాసిక్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు. మొత్తం 13 దేశాలకు చెందిన చెస్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
సాధించిన మెడల్స్‌తో అక్షత్ చౌహాన్


