స్టేషన్‌ఘన్‌పూర్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడల ద్వారా దేహదారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కల్గుతుందని మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ అన్నారు. డివిజన్‌కేంద్రంలో షూటింగ్‌బాల్ జూనియర్ బాల, బాలికల జిల్లాస్థాయి ఎంపిక పోటీలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ మాట్లాడారు..క్రీడలతో స్నేహభావం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. షూటింగ్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నెపు కుమార్ మాట్లాడుతూ.. ఎంపిక పోటీలకు బాలురు 60 మంది, బాలికలు 40 మంది వచ్చారని, వారిలో క్రీడాప్రతిభ ఆధారంగా ఎంపిక చేశామన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికై న వారు ఈనెల 10 నుంచి 12వ తేదీవరకు మెదక్ జిల్లా తూఫ్రాన్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలి పారు. అసోసియేషన్ జిల్లా చైర్మన్ గద్దె అనీల్‌కుమార్, ఉపాధ్యక్షులు దేవ్‌సింగ్, సాంబరాజు, పీడీలు రవీందర్, అశోక్, సాంబన్న, రాజు, నరేశ్, రేణుక, మహాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


