పెన్షనర్ల ఆవేదనకు దృశ్యరూపం | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్ల ఆవేదనకు దృశ్యరూపం

Oct 9 2026 2:20 AM | Updated on Oct 9 2026 2:20 AM

జిల్లా కేంద్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయుడు సయ్యద్‌ హష్మత్తుల్లా హుస్సేన్‌ గీసిన బొమ్మ పెన్షనర్ల పరిస్థితికి అద్దం పడుతోంది. ఉచిత బస్సు ప్రయాణాలు, విద్యుత్‌, గ్యాస్‌ సిలిండర్ల వంటి సంక్షేమ పథకాలకు లేని ఆర్థిక భారం, రిటైర్డ్‌ ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఎందుకు వస్తోందని ఆయన ప్రశ్నించారు. గ్రాట్యూటీ, జీపీఎఫ్‌, లీవ్‌ శాలరీ, కమ్యూటేషన్‌, పీఆర్‌సీ 2023 వంటి కష్టపడి సంపాదించుకున్న చట్టబద్ధమైన బకాయిలను కాళ్ల కింద తొక్కిపెట్టడం ఎంతవరకు ధర్మమని ఈ కార్టూన్‌ ద్వారా ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పెన్షనర్ల ఆవేదన తీర్చాలని, వారి హక్కులను న్యాయంగా పునరుద్ధరించాలని ఈ చిత్రం బలంగా కోరుతోంది.

– జనగామ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement