● జిల్లాలో 11,739 దరఖాస్తులు
● ఫారం–8కే అత్యధిక స్పందన
● కొత్త ఓటర్ల కోసం
4,096 దరఖాస్తులు
● ఇప్పటి వరకు 2,246 అప్‌డేట్
జనగామ: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్)లో జిల్లాలో సవరణలు, మార్పులు, చేర్పులకే ప్రజలు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. జూన్‌న్ 15 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించిన ప్రక్రియలో జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో ఫారం–6, 6ఏ, 7, 8 ద్వారా మొత్తం 11, 739 దరఖాస్తులు అందాయి. వీటిలో ఇప్పటివరకు 2,246 దరఖాస్తులు పరి ష్కరించి అప్‌డేట్ చేయగా, మరో 9,493 దరఖాస్తులు ప్రక్రియలో ఉన్నాయి.
ఫారం–8కే భారీ స్పందన
ఓటరు జాబితాలో పేరు, చిరునామా, ఇతర వ్యక్తిగత వివరాల సవరణలు, బదిలీల కోసం ఫారం–8 ద్వారా అత్యధికంగా 7,540 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 2,041 అప్‌డేట్ అయ్యాయి. జనగామలో 3,046కు 926, స్టేషన్‌న్ ఘన్‌పూర్‌లో 2,362కు 1,006, పాలకుర్తిలో 2,132కు 109 దరఖాస్తులు పరిష్కరించారు. మొత్తం దరఖాస్తుల్లో ఫారం–8 వాటా సుమారు 64 శాతం కావడం గమనార్హం.
కొత్త ఓటర్ల దరఖాస్తులు 4,096
18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటు హక్కు పొందేందుకు ఫారం–6 ద్వారా 4,096 దరఖాస్తులు వచ్చాయి. జనగామలో 1,453, స్టేషన్ ఘన్‌పూర్‌లో 1,429, పాలకుర్తిలో 1,214 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కేవలం 134 మాత్రమే అప్‌డేట్ అయ్యాయి. ఇందులో స్టేషన్‌న్ ఘన్‌న్‌పూర్ 61, పాలకుర్తి 38, జనగామ 35 ఉన్నాయి.
తొలగింపునకు 98 దరఖాస్తులు
ఓటరు జాబితాలో మరణించిన, ప్రాంతం మారిన లేదా అనర్హులైన ఓటర్ల తొలగింపునకు ఫారం–7 ద్వారా 98 దరఖాస్తులు రాగా, 71 పేర్లు తొలగించారు. జనగామలో 47కు 35, స్టేషన్ ఘన్‌పూర్‌లో 38కు 25, పాలకుర్తిలో 13కు 11 పరిష్కరించారు. ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల కోసం ఫారం–6ఏ ద్వారా కేవలం 5 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా ఇప్పటికే ఉన్న ఓటర్ల వివరాల సవరణపై ప్రజల ఆసక్తి కొత్త నమోదుతో పోలిస్తే స్పష్టంగా ఎక్కువగా కనిపిస్తోంది. మిగిలిన దరఖాస్తులను వేగంగా పరిశీలిస్తే తుది ఓటర్ల జాబితా మరింత కచ్చితత్వంతో రూపొందే అవకాశం ఉంది.


