ఆర్టీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం

Oct 9 2026 2:20 AM | Updated on Oct 9 2026 2:20 AM

జనగామ: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు జనగామ డిపో సర్వం సిద్ధమైంది. జిల్లా కార్మిక శాఖ అధికారి, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కుమారస్వామి ఆధ్వర్యంలో ఈనెల 9న (శుక్రవారం) ఎన్నికల కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. డిపో మేనేజర్‌ ఉష ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్‌కు మరికొద్ది గంటలే సమయం ఉండటంతో ఆయా సంఘాల నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ), నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయూ), తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) కలిసి జేఏసీగా పోటీ చేస్తున్నాయి. మరో వైపు తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ (టీడబ్ల్యూ యూ), స్టేట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఎస్‌డబ్ల్యూ యూ) బరిలో నిలిచాయి.

రెండు ఓట్లు.. తొమ్మిది గుర్తులు

కార్మికులు ఎన్నికల్లో రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. క్లాస్‌–3 స్టేట్‌ స్థాయికి ఒక ఓటు, రీజినల్‌ లెవల్‌ క్లాస్‌–6కు మరో ఓటు వేయాలి. మొత్తం తొమ్మిది గుర్తులను కేటాయించారు. బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. జనగామ డిపోలో మొత్తం 400 మంది కార్మికులకు ఓ టు హక్కు ఉంది. ఓ టర్లు తప్పనిసరిగా ఐడీ కార్డు చూపించి ఓటు వేయాల్సి ఉంటుంది.

ఉదయం 5 నుంచి పోలింగ్‌

ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. సాయంత్రం 6.20 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అయితే ఎన్నికల ఫలితాలను ఈ నెల 17న అధికారికంగా ప్రకటించనున్నారు. పోలింగ్‌ కేంద్రంలో ఆయా సంఘాలకు చెందిన ఏజెంట్లు ఉండి ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. రిటర్నింగ్‌ అధికారి కుమారస్వామితో పాటు మరో నలుగురు ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

డిపోలో సందడి

ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో డిపో ఆవరణ సందడిగా మారింది. నమూనా బ్యాలెట్‌ పత్రాలు, కండువాలతో కార్మిక సంఘాల నాయకుల హడావిడి కనిపించింది. సుదీర్ఘకాలం తర్వాత ఆర్టీసీలో ఎన్నికల సందడి నెలకొనడంతో కార్మికుల్లోనూ ఆస క్తి నెలకొంది. ప్రచారం తీరు స్థానిక సంస్థల ఎన్నికలను తలపించింది. ఎన్నికల నేపథ్యంలో సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో డిపో ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

డిపోలో ఏర్పాట్లు పూర్తి

నేడు పోలింగ్‌, సాయంత్రం లెక్కింపు

ఈనెల 17న ఫలితాల ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement