● ధాన్యం నిల్వల్లో తేడాలు..
● అధికారుల స్వాధీనంలోకి రైస్‌మిల్లు
పాలకుర్తి టౌన్: మండలంలోని వావిలాల అన్నపూర్ణ రైస్ మిల్లులో లెవీ ధాన్యం నిల్వల్లో వ్యత్యాసాలను గుర్తించడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఆగస్టులో విజిలెన్స్ బృందం నిర్వహించిన తనిఖీలో మిల్లులో ఉండాల్సిన ధాన్యం, వాస్తవ నిల్వలో తేడా బయటపడింది. అనంతరం ఫిజికల్ రీ–వెరిఫికేషన్ నిర్వహించి ధాన్యం పక్కదారి పట్టినట్లు నిర్ధారించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సోమవారం పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘనందన్, తహసీల్దార్ ఎస్.సరస్వతితో కలిసి పంచనామా నిర్వహించారు. అనంతరం మిల్లును తహసీల్దార్ ఆధీ నంలోకి అప్పగించారు. అక్రమాలపై చర్యలు తీసుకున్న అధికారులను వావిలాల రైతులు అభినందించారు. ఆర్‌ఐ రాకేశ్, సిబ్బంది పాల్గొన్నారు.


