మార్కెట్‌ యార్డు కమాన్‌ గేట్‌ ఓపెన్‌ | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ యార్డు కమాన్‌ గేట్‌ ఓపెన్‌

Oct 6 2026 1:30 AM | Updated on Oct 6 2026 1:30 AM

జనగామ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు వచ్చే ముఖద్వారం (కమాన్‌ గేట్‌) సోమవారం అధికారికంగా తెరుచుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం వాస్తు మార్పుల నేపథ్యంలో అప్పటి పాలకవర్గం ఈ గేట్‌ను మూసివేసింది. దీంతో మార్కెట్‌కు వచ్చే రైతులు, వ్యాపారులు, ప్రజలకు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో వారి సౌకర్యార్థం కమాన్‌ గేట్‌ను తిరిగి తెరవాలని కోరుతూ పలు వురు విజ్ఞప్తి చేశారు. మార్కెట్‌కు ముఖద్వారం ప్రాధాన్యంపై పండితుల సూచనలు తీసుకున్న అనంతరం గేట్‌ను తెరిపించినట్లు ఏఎంసీ చైర్మ న్‌ బనుక శివరాజ్‌యాదవ్‌ తెలిపారు. అధికారికంగా గేట్‌ సేవలు అందుబాటులోకి రావడంతో మార్కెట్‌కు వచ్చే రైతులు, వ్యాపారులకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి.

‘ఆర్టీసీ ఎన్నికల్లో టీడబ్ల్యూయూ జెండా ఎగురవేయాలి’

జనగామ రూరల్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల9వ తేదీన ఆర్టీసీలో నిర్వహించనున్న యూనియన్‌ ఎన్నికల్లో టీడబ్ల్యూయూ(తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌) జెండా ఎగురవేయాలని యూని యన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎంబీకే రెడ్డి అన్నారు. సోమవారం కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంప్లాయీస్‌ యూనియన్‌ నుంచి టీడబ్ల్యూయూలోకి పలువురు నాయకులు, కార్మికులు చేరారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాలమణి, కౌన్సిలర్లు లోకమంతరెడ్డి, కరుణాకర్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

‘ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు భూములివ్వం’

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని నష్కల్‌, వంగాలపల్లి గ్రామాల రైతులు అన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు భూములు ఇవ్వమని స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదు ట సోమవారం వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చిల్పూ రు మండలం నష్కల్‌, వంగాలపల్లి గ్రామాల సర్వే నంబర్‌ 143లోని భూములను ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు ఇవ్వబోమన్నారు. ప్రతీ దళితుడి భూమికి పట్టాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తిరిగి దళితుల భూములను లాక్కోవడం అమానుషమన్నారు. ఈ యూనిట్‌తో 90 మంది రైతుల కటుంబాలు రోడ్డున పడతామ ని, అలా జరిగితే ఆత్మహత్యలే శరణమన్నారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని రైతులు కోరారు. బీజేపీ మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్‌యాదవ్‌, రైతులు గంటె చంద్రుడు, శాగంటి అనీల్‌, దాసు పాల్గొన్నారు.

మై ట్యాక్సీ సేఫ్‌ యాప్‌ ఆవిష్కరణ

కాజీపేట: ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి ఆటోడ్రైవర్లు, పోలీసులకు సహకరించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత అన్నారు. కాజీపేట ప్యారడైజ్‌ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన ఆటో ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ‘అభయ మై టాక్సీ సేఫ్‌’ యాప్‌ను సీపీ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో దాదాపు 12వేల ఆటోలకు క్యూ ఆర్‌ కోడ్‌తో కూడిన డిజిటల్‌ నంబర్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తామంటూ ఆటోడ్రైవర్లతో సీపీ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీసీపీ దార కవిత, ట్రాఫిక్‌ అడిషనల్‌ డీసీపీ రాయల ప్రభాకర్‌రావు, ఏసీపీ టి.సత్యనారాయణ, సీఐలు పిట్టల వెంకన్న, జక్కుల శ్యాంసుందర్‌, ఎస్సైలు మంగ, శ్రావణ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement