వైభవంగా అమ్మవారి దివ్య ఆగమనం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా అమ్మవారి దివ్య ఆగమనం

Oct 6 2026 1:30 AM | Updated on Oct 6 2026 1:30 AM

జనగామ: పట్టణంలోని శ్రీ విల్లాస్‌ కాలనీలో దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం ‘అమ్మవారి దివ్య ఆగమనం’ పేరిట ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేమళ్ల అభిలాష్‌రెడ్డి(టీం ఆఫ్‌ శ్రీ విల్లాస్‌ కాలనీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆలయాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్టింగ్‌లో అమ్మవారికి అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి శ్రీనివాస్‌, డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి, వైటీడీఏ మెంబర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ నాయక్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ వేముల సత్యనారాయణరెడ్డి, కంచ రాములు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆర్టీసీ చౌరస్తా మీదుగా శ్రీ విల్లాస్‌ కాలనీకి చేరుకున్న శోభాయాత్రతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆగమన శోభాయాత్రను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు మణిరాజ్‌, మణిదీప్‌, రమేశ్‌, వరుణ్‌, వేముల అభిలాష్‌రెడ్డి, సత్యకుమార్‌, శ్రీనివాస్‌ రెడ్డి, విఠల్‌, శేఖర్‌, సాత్విక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement