ఎంతటి కష్టానికైన వెనకాడలేదు.. | - | Sakshi
Sakshi News home page

ఎంతటి కష్టానికైన వెనకాడలేదు..

Jun 21 2026 12:49 AM | Updated on Jun 21 2026 12:49 AM

మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ రెడ్డి

జనగామ: ప్రతీ విజయవంతమైన వ్యక్తి వెనుక కు టుంబం నిలుస్తుంది. కానీ కొన్నిసార్లు ఆ విజయానికి అసలైన పునాది ఒక తండ్రి త్యాగం, కష్టం. అలాంటి అరుదైన జీవిత గాథ జనగామ మున్సి పల్‌ కమిషనర్‌ చిమ్ముల రాజశేఖర్‌రెడ్డిది. బచ్చన్నపేట మండలకేంద్రానికి చెందిన సాధారణ రైతు మల్లారెడ్డి తన కుమారుడు ఉన్నత స్థాయికి చేరా లని కలలు కనడమే కాకుండా, ఆ కలను నిజం చేయడానికి జీవితాన్నే అర్పించారు. కుమారుడి చదువు, కుటుంబ పోషణకు తండ్రి మల్లారెడ్డి వ్యవసాయంతో పాటు ఇటుక బట్టీల్లో పనిచేయడం, పా లు అమ్మడం వంటి కష్టమైన పనులు చేశారు.

కొడుకు చదువు కోసం గేదెను అమ్మిన తండ్రి

రాజశేఖర్‌రెడ్డి జీవితంలో ఎన్నటికీ చెరగని జ్ఞాపకం ఆయన బీటెక్‌ చదువుకు సంబంధించినది. ఇంజినీరింగ్‌ చదవడానికి అవసరమైన ఖర్చు సమకూర్చేందుకు మల్లారెడ్డి కుటుంబానికి ఉన్న ఆర్థిక వనరైన ఏకై క గేదెను అమ్మేశారు. ఆ రోజు తండ్రి చేసిన త్యాగం రాజశేఖర్‌రెడ్డికి జీవితాంతం మరచిపోలేని పాఠమైంది. జీవితంలో కష్టపడితేనే మంచి ఫలి తం వస్తుందని తండ్రి మాటలను ఆచరణలో పెట్టా రు. చదువులో పట్టుదలతో ముందుకెళ్లి ప్రభుత్వ ఉ ద్యోగమే లక్ష్యంగా శ్రమించారు. 2014లో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. అక్కడితో ఆగకుండా మరింత ఉన్నత స్థాయికి చేరాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు.

గ్రూప్‌–1తో మున్సిపల్‌ కమిషనర్‌ స్థాయికి..

నిరంతర శ్రమ, క్రమశిక్షణ, తండ్రి ఆశీర్వాదం కలిసి రాజశేఖర్‌రెడ్డిని మరో మెట్టెక్కించాయి. 2025లో గ్రూప్‌–1 ద్వారా మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన కుమారుడు ఉన్నతాధికారిగా నిలవడం వారి కుటుంబానికి గర్వకారణమైంది.

నాన్న చూపిన దారిలోనే..

తన ఉన్నత స్థాయికి కారణం తండ్రి మల్లారెడ్డి. ఆయన చూపిన దారిలోనే సమాజానికి సేవ చేయ డం, జిల్లాకు మంచి పేరు తీసుకురావడం తన జీవి త ధ్యేయం. తల్లిదండ్రుల త్యాగం, పిల్లల పట్టుదల కలిస్తే సాధారణ కుటుంబమైనా విజయం సాధించవచ్చు. – రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement