ఉద్యమకారుడు ఎల్లస్వామికి సన్మానం | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారుడు ఎల్లస్వామికి సన్మానం

Jun 3 2026 12:57 AM | Updated on Jun 3 2026 12:57 AM

రఘునాథపల్లి: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకొని మండలంలోని ఇబ్రహీంపూర్‌ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు చింత ఎల్లస్వామికి అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఙాన కేంద్రంలో అలయ్‌ బలయ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎంపీలు ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్‌ మంగళవారం ఎల్లస్వామిని ఘనంగా సన్మానించారు. ఎల్లస్వామి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి రెండు సార్లు జైలు జీవితం అనుభవించాడు. ఈనేపథ్యంలో ఆయన్ను సన్మానించారు.

Advertisement
 
Advertisement
Advertisement