జనగామ రూరల్: జిల్లాలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా ముగిసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మంగళవాకం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, రవాణా పరంగా తీసుకుంటున్న చర్యల పురోగతిపై అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుది దశకు వచ్చిందని, కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వేగంగా తరలించి, నిల్వ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీఓ భాస్కర్, పౌరసరఫరాల సంస్థ డీఎం హతీరామ్, రవాణా శాఖ అధికారి శిల్ప, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, డీసీఎస్‌ఓ సురేష్ రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


