గళమే ఆయుధం.. | - | Sakshi
Sakshi News home page

గళమే ఆయుధం..

Jun 3 2026 12:57 AM | Updated on Jun 3 2026 12:57 AM

జనగామ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో జిల్లా కవులు, కళాకారులు పోషించిన పాత్ర విశేషమైంది. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీరు తమ కలం, గళాన్ని ఆయుధాలుగా మలుచుకున్నారు. కవి, కళాకారుడు జి.కృష్ణ స్వచ్ఛంద సేవా సంస్థల సమాఖ్య అధ్యక్షుడిగా ఉద్యమానికి నాయకత్వం వహించారు. జనగామ జేఏసీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ నిరా హార దీక్షలు నిర్వహించారు. ధూంధాం కార్యక్రమాలు, సాంస్కృతిక సభల్లో పాటల ద్వారా ఉద్యమ స్ఫూర్తి నింపారు. కళాకారుడు పన్నీరు సత్యం, పెంబర్తి జేఏసీ కన్వీనర్‌, కవి, గాయకుడు అయిలా సోమనర్సింహాచారి, కవి, గాయకుడు పెట్లోజు సోమే శ్వరాచారి, ఎర్రవెల్లి సూర్యం, నారసింహుల రామస్వామి, గుగ్గిల్ల నర్సయ్య, రాగల్ల నరేష్‌, గట్టగల్ల సంజీవ, జనగామ శంకర్‌, గజవెల్లి ప్రతాప్‌, దాసరి మల్లేష్‌, మౌనిక తదితర కళాకారులు ధూంధాం కార్యక్రమాల ద్వారా ఉద్యమానికి ఊపిరి పోశారు.

Advertisement
 
Advertisement
Advertisement