న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2026
7
విద్యుత్ దీపాల వెలుగులో సమీకృత కలెక్టరేట్ భవనం
వడగాల్పులతో
ఆసుపత్రుల బాట
ఎండ తీవ్రత కారణంగా వృద్ధులు, చిన్నారులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరసం, జ్వరం,
వాంతులు, తలనొప్పి, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో ఆసుపత్రులకు వెళ్తున్నారు. రోజంతా ఎండలో పనిచేసే కార్మి కులు ఆరోగ్య సమస్యల
బారిన పడకుండా జాగ్రత్తలు
తీసుకోవాలని వైద్యులు
సూచిస్తున్నారు.
వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం
జఫర్‌గఢ్: మండల కేంద్రమైన వేల్పుగొండ లక్ష్మీనర్సింహస్వామి కొండ దిగువన ఉన్న శ్రీసీతారామచంద్రలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా సాగింది. లక్ష్మీనర్సింహస్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా మూడు రోజుల పాటు స్వామివారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 29న ప్రారంభమైన జయంతి ఉత్సవాలు చివరి రోజున స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. మూడు గంటలకు పైగా సాగిన స్వామివారి కల్యాణాన్ని భక్తులు కనులారా తిలకించి భక్తిపారవశ్యంతో మునిగిపోయారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు పొడిచేటి వెంకటాచార్యులు, శ్రీనివాసచార్యులు, కృష్ణమాచార్యులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పబ్లిక్ స్కూల్ ప్రవేశానికి జిల్లా విద్యార్థి ఎంపిక
జనగామరూరల్: విద్య ద్వారానే సమాజంలో సామాజిక, ఆర్థిక మార్పులు సాధ్యమవుతాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్పరెన్స్ హాల్‌లో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన 2026–27విద్యా సంవత్సరానికి గాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతాపూర్‌లో 1వ తరగతి ప్రవేశాల ఎంపిక కోసం లక్కీడ్రా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.. జిల్లాకు చెందిన షెడ్యూల్ కు లాల (ఎస్సీ) బాలబాలికల నుంచి మొత్తం (13) దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. జిల్లాలకు కేటాయించిన ఒక సీటుకు పలువురు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో, ఎంపిక ప్రక్రియలో పూర్తి పారదర్శక త, నిష్పక్షపాత ధోరణి పాటిస్తూ, లక్రీ డ్రా చేపట్టినట్లు వెల్లడించారు. లక్కీడ్రా ద్వారా ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థి ఎంపికయ్యారన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి విక్రమ్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పదోన్నతితో బాధ్యతలు పెరుగుతాయి
వరంగల్ క్రైం : పోలీస్ అధికారులకు పదోన్నతితో పాటు మరింత బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఎస్సైగా పదోన్నతి పొందిన సయ్యద్ సిరాజ్ పాషా, ఏఎస్సైగా పదోన్నతి పొందిన రాజేంద్రప్రసాద్ ఆదివారం సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై పోలీసు కమిషనర్ పదోన్నతి చిహ్నాలను అలంకరించారు. ఈ సందర్భంగా సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజల నమ్మకానికి తగ్గట్లుగా విధులు నిర్వహిస్తూ, ప్రజల అభిమానాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఆర్మీ ఉద్యోగాలకు ఏబీవీ విద్యార్థుల ఎంపిక
జనగామ రూరల్: ఇండియన్ ఆర్మీ ఇటీవల విడుదల చేసిన రిక్రూట్‌మెంట్ ఫలితాల్లో జిల్లాకేంద్రంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాదించారు. కళాశాలకు చెందిన సీనియర్ ఎన్‌సీసీ క్యాడెట్ శ్రీకాంత్ బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న సీహెచ్. మణిదీపక్ ఆర్మీ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉద్యోగాలకు ఎంపికై న విద్యార్థులు జూన్ 2వ తేదీన సికింద్రాబాద్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత తుది శిక్షణ నిమిత్తం చైన్నె కి వెళ్తారని పేర్కొన్నారు. ఎన్‌సీసీ అధికారి, ఫిజికల్ డైరెక్టర్ టి.కల్యాణి 10 తెలంగాణ బెటాలియన్, వరంగల్, కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రామదురై, అధ్యాపకులు అభినందించారు.
భగ్గుమంటున్న ఎండలు..
బేజారవుతున్న బతుకులు
● జిల్లాలో 44నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
● చిరు వ్యాపారులు, కార్మికులపై తీవ్ర ప్రభావం
● భానుడి భగభగలకు అల్లాడుతున్న జనం
జనగామ: జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ అంతకుపైగా నమోదవుతుండడంతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉదయం 8 గంటలకే సూర్యుడు నిప్పులు కురిపిస్తుండడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోతోంది. ఉదయం 11 గంటలు దాటిందంటే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి.
రెండు నిమిషాల ప్రయాణమే కష్టంగా
ద్విచక్ర వాహనంపై రెండు నిమిషాలు ప్రయాణించినా శరీరం మొత్తం మంటలు పుట్టే పరిస్థితి నెలకొంది. ఉద్యోగులు, కార్మికులు, డెలివరీ సిబ్బంది, చిరు వ్యాపారులు ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
కస్టమర్ల కోసం ఎండలోనే ఎదురుచూపులు
ఎండల ప్రభావం ఎక్కువగా చిరు వ్యాపారులపై పడుతోంది. రోడ్లపై జన సంచారం తగ్గిపోవడంతో వ్యాపారాలు పూర్తిగా మందగించాయి. పండ్ల వ్యాపారులు, కూరగాయల విక్రేతలు, టీస్టాళ్ల నిర్వాహకులు, మామిడి పండ్లు, సోడాలు, బట్టలు, తాళా లు తదితర వస్తువులను విక్రయిస్తూ అనేక కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. బండ్లపై వ్యాపారం చేసే వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు మండే ఎండలోనే కస్టమర్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఎండకు తలదాచుకుంటూ ఎండను తట్టుకుంటూ జీవన పోరాటం సాగిస్తున్నారు. ఎండకు బయటకు వచ్చేవాళ్లే లేరు వ్యాపారం లేక రోజువారీ ఫైనాన్స్ కూడా కట్టలేకపోతున్నారు. కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలోనే కూర్చోవాల్సి రావడంతో ఫుట్‌పాత్, చిరు వ్యాపారుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వృద్ధులు, చిన్నారులు ఇంటికే పరిమితమవుతున్నారు.
లక్షల నుంచి వేలకు
జిల్లా కేంద్రంతో పాటు స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, రఘునాథపల్లి, బచ్చన్నపేట, నర్మెట తదితర మండలాల్లో రోజువారీగా లక్షల రూపాయల విలువైన ఫుట్‌పాత్ వ్యాపారం సాగుతుంది. అయితే చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో వ్యాపారం వేలకు పడిపోయి తీవ్రంగా దెబ్బతింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రహదారులు నిర్మానుష్యంగా మారడంతో వ్యాపారం దాదాపు జీరోకు పడిపోతుంది. లక్షల్లో జరిగే అమ్మకాలు వేలకు పరిమితమవడంతో చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రిళ్లు వేడి సెగ
ఉదయం ఎండలతో పాటు రాత్రివేళల్లోనూ వేడి తగ్గడం లేదు. సాయంత్రం 6 గంటలు దాటినా రోడ్ల నుంచి వేడి సెగలు వస్తూనే ఉన్నాయి. అర్ధరాత్రి వరకు ఉక్కపోత కొనసాగుతుండడంతో ప్రజలకు నిద్ర కరువవుతోంది. ఇళ్లలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నడుస్తున్నా పెద్దగా ఉపశమనం లభించడం లేదు. డాబాలపై పడుకుందామంటే దోమలు, కోతుల ఇబ్బందులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో చెమటలు కక్కుతూ ఇళ్లలోనే నిద్రించాల్సిన పరిస్థితి నెలకొంది.
‘డీఈఈసెట్’ సర్టిఫికెట్ల పరిశీలన
విద్యారణ్యపురి : డీఈఐఈడీలో మొదటి సంవత్సరంలో తెలుగు/ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో ప్రవేశాలకు గాను సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 2నుంచి 5వతేదీ వరకు నిర్వహిస్తామని హనుమకొండలోని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ రంగయ్యనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఈఈసెట్– 2026 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు వెరిఫికేషన్‌కు ర్యాంక్ కార్డు, హాల్‌టికెట్, టెన్త్, ఇంటర్ మెమో, 4వతరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ, టీసీ, ఎన్‌సీసీ/స్పోర్ట్స్, పీహెచ్‌సీ పత్రాలతో రావాల్సింటుందన్నారు. 6 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
కాజీపేటకు అన్ని అర్హతలు ఉన్నా మొండిచెయ్యే
నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వేజోన్
అమలు
రైల్వే పునర్వ్యవస్థీకరణతో ప్రజల్లో ఆశలు
డివిజన్ ఏర్పాటు కోసం ఉద్యమాలకు
సిద్ధమవుతున్న ఉద్యోగ, ప్రజాసంఘాలు
1. నిర్మానుష్యంగా
జనగామ ఆర్టీసీ చౌరస్తా
2. కొనుగోలుదారులు ఎవరూ రాకపోవడంతో అక్కడే సేదతీరుతున్న కూరగాయలమ్ముకునే మహిళా వ్యాపారి
3. మండే ఎండలో వ్యాపారాలు లేక నీరసించి కూర్చున్నచోటే కునుకు తీసుకునిన చిరు వ్యాపారులు
4. 44డిగ్రీల ఎండలోనూ జీవనోపాధి కోసం రిక్షా తొక్కతున్న కష్టజీవి
5. ఓ వస్త్ర దుకాణం వద్ద ఎండకు ఫ్యాషన్ బొమ్మలు పాడుకాకుండా బెడ్‌షీట్ కప్పిన వ్యాపారి


