ధాన్యం తరలింపు వేగంగా సాగాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం తరలింపు వేగంగా సాగాలి

Jun 1 2026 3:55 AM | Updated on Jun 1 2026 3:55 AM

జనగామ రూరల్‌: జిల్లాలోని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అదేశించారు. ఆది వారం అడవికేశవాపూర్‌, ఎర్రగొల్లపహాడ్‌, షామీర్‌పేట్‌, వడ్లకొండ, గానుగుపహాడ్‌, వెంకిర్యాలలోని ఐకేపీ, పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

రూ.312 కోట్లు జమ..

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా కొనుగోళ్లు చేపట్టాలని, జిల్లాలో ఇప్పటి వరకు 27,141 రైతుల వద్ద నుంచి 1,67,976.430 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం చేసినట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా వెల్లడించారు. ఇప్పటికే 26,097 మంది రైతులకు గాను వారి ఖాతాల్లో రూ.312 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్ల పూరోగతిపై అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఆర్‌డీఓ భాస్కర్‌, పౌరసరఫరాల సంస్థ డీఎం హతీరామ్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి రామకృష్ణ, డీసీఎస్‌ఓ సురేష్‌రెడ్డి, అధికారి శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

నర్మెటలో..

నర్మెట: ధాన్యం కొనుగోలు, తరలింపు వేగవంతం చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా నిర్వాహకులను ఆదేశించారు. హన్మంతాపురం, వెల్దండ, అమ్మాపురం, తరిగొప్పుల మండలంలోని మండలకేంద్రంతోపాటు పోతారం, షోలీపురంలలోని ఐకేపీ,, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement
 
Advertisement
Advertisement