పాలకుర్తి టౌన్: ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదని, ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. మండలంలోని తొర్రూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. 40 రోజులుగా గన్నీబ్యాగులు, లారీలు అందుబాటులో లేక ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని రైతులు ఆయన దృష్టికి తీసుకుచ్చారు. వెంటనే కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో ఫోన్‌లో మాట్లాడిన దయాకర్‌రావు రైతులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. కల్టెకర్ త్వరలోనే కొనుగోళ్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, మాచార్ల పుల్లయ్య, సర్పంచ్‌లు యాకసోమయ్య, బానోత్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు,
మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన మాజీమంత్రి


