రేపటిలోగా కొనుగోళ్లు పూర్తవ్వాలి | - | Sakshi
Sakshi News home page

రేపటిలోగా కొనుగోళ్లు పూర్తవ్వాలి

Jun 1 2026 3:55 AM | Updated on Jun 1 2026 3:55 AM

రఘునాథపల్లి: జూన్‌ 2 వరకు గడువు, ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం మండలంలోని వెల్ది, అశ్వరావుపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన ధాన్నాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కుమార్‌గౌడ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ముసిపట్ల విజయ్‌, పెండ్లి మల్లారెడ్డి, గూడ కిరణ్‌, కొర్ర రాజేందర్‌నాయక్‌, ఎడ్ల బాలరాజు, గోనె మల్లారెడ్డి, పెండ్లి భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు: మాజీ ఎమ్మెల్యే రాజయ్య

Advertisement
 
Advertisement
Advertisement