● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: ఉపాధి హామీలో ఎక్కువ మంది కూలీలకు పని కల్పించాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న వీఓ, అంగన్వాడీ, జీపీ భవనాలు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం కలెక్టరెట్‌లోని కాన్ఫెరెన్స్ హాల్‌లో ఉపాధి హామీ కూలీలు, షెల్ఫ్ ఆఫ్ వర్క్, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలు, చేయూత పెన్షన్‌లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం లో పంచాయతీ రాజ్ శాఖ ఈఈ, డీఈ, ఏఈలు, ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం కావాలి
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియ మరింత వేగవంతం కావాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఓటరు జాబితా అంశంపై ఆర్డీఓ, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లల్లో వేగం పెంచి సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సంబంధి అధికారులను ఆదేశించారు. బుధవారం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై సమీక్షించారు. సమావేశంలో డీఆర్‌డీఓ భాస్కర్, మార్క్‌ఫెడ్ డీఎం చంద్రశేఖర్, డీసీఓ కోదండరాములు తదితరులు పాల్గొన్నారు.
జాప్యానికి తావివ్వొద్దు..
రఘునాథపల్లి: ఽజిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియలను వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం రఘునాథపల్లి మండలం వెల్ది, జాఫర్‌గూడెం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్లలో ఏమైనా సమస్య వస్తే టోల్ ఫ్రీ నంబర్ 1800–425–6605లో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.


