పుణ్యప్రదం.. పుష్కర స్నానం | - | Sakshi
Sakshi News home page

పుణ్యప్రదం.. పుష్కర స్నానం

May 28 2026 12:40 AM | Updated on May 28 2026 12:40 AM

– 8లోu

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కాళేశ్వరంలో సరస్వతి నది అంత్యపుష్కరాలు కొనసాగుతున్నాయి. ఏడో రోజు బుధవారం సుమారు 25 వేల మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్‌కు చెందిన శ్రీదత్తగిరి మహరాజ్‌ ఆశ్రమ పీఠాధిపతి, తెలుగు రాష్ట్రాల మహామండలేశ్వర్‌ శ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహరాజ్‌, మహామండలేశ్వర్‌ ఈట సిద్ధేశ్వరానందగిరి మహరాజ్‌ త్రివేణి సంగమం వద్ద వైభవంగా గంగా హారతి నిర్వహించారు. సాయంత్రం దేవాదాయ శాఖ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. – కాళేశ్వరం

పుష్కరఘాట్‌లో స్నానాలు చేస్తున్న భక్తులు

Advertisement
 
Advertisement
Advertisement