ఎకై ్సజ్‌ కార్యాలయం ఎప్పటికీ పూర్తయ్యేనో? | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ కార్యాలయం ఎప్పటికీ పూర్తయ్యేనో?

May 28 2026 12:40 AM | Updated on May 28 2026 12:40 AM

ముందుకు సాగని నిర్మాణ పనులు

చేతులెత్తేసిన కాంట్రాక్టర్‌

పాలకుర్తి టౌన్‌: మండల కేంద్రంలో ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆధికారుల నిర్లక్ష్యం, పాలకుల ఆలసత్వంతో పనులు మందుకు సాగడం లేదు. 2017లో అప్పటి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈరవెన్ను రూట్‌లో పంచారాయి భూమిలో ఆరు గుంటల భూమి ఎకై ్సజ్‌ కార్యాలయం కోసం కేటాయించారు. అంతేకాకుండా రాష్ట్ర పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ నిధుల నుంచి రూ.40 లక్షల నిధులు విడుదల చేసి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే దయాకర్‌రావు భూమిపూజ చేశారు. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ఆగిపోయాయి. కాంగ్రెస్‌ పార్టీ అధికారంంలోకి రాగానే కాంట్రాక్టర్‌ చేతులు ఎత్తేయడంతో కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. భవనం పనులు పూర్తయినా తలుపులు, కిటికీలు, విద్యుత్‌, టైల్స్‌, వెంటిలేటర్‌లు ఇంకా బిగించలేదు. సగం వరకు ఇంకా పనులు చేయాల్సి ఉంది. అర్ధంతరంగా నిలిచిన పనులను వేగవంతం చేయకుండానే నిర్లక్ష్యంగా వదిలేశారు.

చర్యలు తీసుకుంటాం..

ప్రభుత్వం రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయం నిర్మాణ పనులు చేపట్టింది. నిర్మాణ పనులు అగిపోయింది నిజమే, మిగిలిన పనులను త్వరాగా పూర్తి చేసేందుకు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తయేందుకు చర్యలు తీసుకుంటాం.

– సంతోష్‌రెడ్డి, ఎకై ్సజ్‌ సీఐ, పాలకుర్తి

Advertisement
 
Advertisement
Advertisement