స్పందించిన అధికారులు | - | Sakshi
Sakshi News home page

స్పందించిన అధికారులు

May 28 2026 12:34 AM | Updated on May 28 2026 12:34 AM

నర్మెట: సోమవారం సాయంత్రం కురిసిన వర్షం, గాలివాన బీభత్సానికి మండలంలో చెట్లు విరిగి పడటం, ట్రాన్స్‌ఫార్మర్స్‌ పడిపోవడం. విద్యుత్‌ స్తంభాలు ఒరిగిపోవడం, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోవడం సంఘంటనలపై కథనం సాక్షిలో ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు.

చెత్త తొలగింపు

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఘన్‌పూర్‌ పట్టణ కేంద్రంలోని ఆర్‌సీఎం చర్చి, వాటర్‌ట్యాంకు సమీపాన ఇష్టారాజ్యంగా కాలనీవాసులు రోడ్డు పక్కనే చెత్త, వ్యర్ధాలను వేస్తున్న విషయమై చెత్తశుద్ది లేని మున్సిపల్‌ అధికారులు శీర్షికన సాక్షి దినపత్రికలో ఈనెల 23న ప్రచురితమైన కథనంపై మున్సిపల్‌ అధికారులు స్పందించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్‌సీఎం చర్చి కాలనీలో రోడ్డు పక్కన చెత్త, వ్యర్ధాలను తొలగించి శుభ్రం చేయించినట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement