జనగామ రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన యువకుడు చికిత్స పోందుతూ మృతి చెందిన ఘటన బుధవారం పట్టణంలోని ఏసీ రెడ్డినగర్‌లో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏసీరెడ్డినగర్‌లో నివాసముంటున్న పండు అనిత పర్షరాములు కుమారుడు చరణ్ కార్తీక్(17) డెకరేషన్ పని చేస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం పని ముగించుకుని బండి కుమార్‌తో స్కూటీపై ఇంటికి వస్తుండగా జనగామ చౌరస్తా వద్ద లారీ ఢీకొట్టింది. దీంతో చరణ్‌కార్తీక్‌కు తీవ్ర గాయాలవ్వగా, కుమార్‌కు స్వల్పగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం చరణ్‌కార్తీక్‌ను హైదరాబాద్‌లోని నీలిమా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించగా చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


