స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధి శివునిపల్లిలోని సర్వే నంబర్ 46లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి పరిరక్షించి శాశ్వతంగా కంచె ఏర్పాటు చేయాలని శివునిపల్లి మాజీ సర్పంచ్ బూర్ల విష్ణు కోరారు. శివునిపల్లిలోని సదరు ప్రభుత్వ భూమి వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై ఈనెల 25న కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించి కబ్జాదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


