జనగామ: ప్రభుత్వ, స్థానిక సంస్థల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2026–27 నూతన విద్యా సంవత్సరంలో ప్రీ–ప్రైమరీ బోధన ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కొత్తగా 39 ప్రీ–ప్రైమరీ స్కూల్స్‌ను ప్రారంభించేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో గతేడాది 16 ప్రీ–ప్రైమరీ బడులు ప్రారంభించగా, కొత్త వాటితో కలుపుకొని 55 కానున్నాయి. దీంతో వచ్చే నెల 12వ తేదీ నుంచి జిల్లాలో కార్పొరేట్‌కు దీటుగా ప్రీ–ప్రైమరీ విద్య మరింత అందుబాటులోకి రానుంది. ఈ బడుల్లో ఇనన్ ఫ్రాస్ట్రక్చర్, ఫర్నిచర్, ఇండోర్, అవుట్‌డోర్ ఆట వస్తువులు, పెయింటింగ్స్ వంటి ఏర్పాట్ల కోసం ప్రతీ పాఠశాల కు ప్రత్యేక నిధులు కేటాయించనున్నారు.
ఒక్కో బడిలో ఇన్‌స్ట్రక్టర్..ఒక ఆయా
ప్రతి పాఠశాలలో ఒక ఇన్‌స్ట్రక్టర్‌తో పాటు ఒక ఆయాను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించనున్నారు. ఇన్‌స్ట్రక్టర్‌కు నెలవారీ గౌరవ వేతనం రూ.8 వేలు, ఆయాకు రూ.6వేలుగా నిర్ణయించారు. నియామకాలకు సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసి, త్రీమెన్ కమిటీ ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. పాఠశాలల్లో వచ్చే నెల ప్రారంభం కానున్న నూతన విద్యా సంవత్సరం నుంచి ప్రీ–ప్రైమరీ సెక్షన్లు ప్రారంభించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్‌లు, డీఈఓలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రీ– ప్రైమరీ విద్యకు ఆర్థిక కష్టాలు ఉండకూడదనే ఉద్దేశంతో రూ.లక్ష నిధులను మంజూరు చేస్తోంది.
జిల్లాలో ప్రీ–ప్రైమరీకి ఎంపికై న
పాఠశాలల జాబితా
యూపీఎస్ గణేష్‌వాడ(జనగామ), పీఎస్(ఏదునూతుల), పీఎస్ (కూనూర్), పీఎస్(వావిలాల), పీఎస్(రఘునాథపల్లి), పీఎస్ (నెల్లుట్ల), పీఎస్(ఉప్పుగల్), పీఎస్ (చాగల్), పీఎస్(పెంబర్తి), పీఎస్(తాటికొండ), పీఎస్(రాజవరం), పీఎస్ (మాధాపురం), యూపీఎస్(నాగిరెడ్డిపల్లి), పీఎస్ (లింగాలఘ న్‌పూర్), పీఎస్(పెద్దమడూరు), పీఎస్(కడవెండి), పీఎస్(కల్లెం), పీఎస్ (కట్కూరు), పీఎస్(అశ్వరావుపల్లి), పీఎస్(లింగంపల్లి), పీఎస్(పల్లగుట్ట), యూపీఎస్(వెంకటాద్రిపేట), పీఎస్(ఇందిరానగర్), పీఎస్(పడమటి కేశ్వా పూర్), పీఎస్(తిమ్మంపేట), పీఎస్(సాల్వాపూర్), పీఎస్(శామీర్‌పేట్), పీఎస్ (గోవర్ధనగిరి), పీఎస్(మల్కాపూర్), పీఎస్(ఓబుల్‌కేశ్వాపూర్), పీఎస్ (వెంకిర్యాల), పీఎస్(భాంజీపేట్), పీఎస్ ఎస్సీ బీసీ కాలనీ(చినపెండ్యాల్), యూపీఎస్(తీగారం), పీఎస్(వడ్లకొండ), పీఎస్(మీదికొండ), యూపీఎస్(గండిరామవరం), పీఎస్(చిల్పూర్), పీఎస్(చిన్నమడూరు) స్కూళ్లు ఉన్నాయి.
తొలిదశ బోధనకు సర్కారు బడులు సిద్ధం
పిల్లల్లో కొత్త వెలుగులు..
జిల్లాకు 39 ప్రీ ప్రైమరీ స్కూల్స్
సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో
కొత్త విద్యావ్యవస్థకు శ్రీకారం


