హై టెన్షన్‌ వైర్లతో ప్రమాదం ఉండదు | - | Sakshi
Sakshi News home page

హై టెన్షన్‌ వైర్లతో ప్రమాదం ఉండదు

May 28 2026 12:34 AM | Updated on May 28 2026 12:34 AM

ట్రాన్స్‌కో ఏడీఈ వేణుగోపాల్‌

బచ్చన్నపేట: మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు పోచన్నపేట శివారు కాశీనగర్‌ సోలార్‌ ప్లాంట్‌ నుంచి వేస్తున్న హై టెన్షన్‌ విద్యుత్‌ లైన్‌తో గ్రామస్తులకు ఎలాంటి ప్రమాదం ఉండదని ట్రాన్స్‌కో ఏడీఈ వేణుగోపాల్‌, నర్మెట సీఐ అబ్బయ్య అన్నారు. బుధవారం పోచన్నపేటలో విద్యుత్‌ లైన్‌ వేస్తుండగా అడ్డుకున్న గ్రామస్తులతో వారు మాట్లాడారు. ఒకప్పుడు ఇలా అడ్డుకుంటే రామగుండం నుంచి కరెంటు వచ్చేది కాదని, అందరూ సహకరిస్తేనే విద్యుత్‌ సరఫరా సాధ్యమన్నారు. లైన్‌ వేయకుండా అడ్డుకోవడం సరైంది కాదని సర్దిచెప్పడంతో కాంట్రాక్టర్‌ రాజు పనులు యథావిధిగా చేపట్టారు. ఆర్డీఓ గోపీరామ్‌, తహసీల్దార్‌ హుస్సేన్‌, ఎస్సై శ్రీకాంత్‌, ఏఈ రాజకుమార్‌, సర్పంచ్‌ ఫిరోజోద్దీన్‌, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement