ఎప్పుడుంటదో.. ఎప్పుడు పోతదో? | - | Sakshi
Sakshi News home page

ఎప్పుడుంటదో.. ఎప్పుడు పోతదో?

May 28 2026 12:34 AM | Updated on May 28 2026 12:34 AM

కొడకండ్ల: అసలే ఎండలు తీవ్రంగా మండుతూ ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతుండగా మండలకేంద్రంలో కరెంటు ఎప్పుడుంటదో ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి నెలకొంది. నాలుగు రోజులుగా మండలకేంద్రంలో మాటిమాటికి కరెంట్‌ ట్రిప్పవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయట ఎండ తీవ్రంగా ఉండటం ఇంట్లో కరెంట్‌ సరిగా ఉండకపోవడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. విద్యుత్‌ సరఫరాలో అవాంతరాలు తలెత్తుతున్నా కూడా పట్టించుకొనే నాథుడే కరువయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలానికి రెగ్యులర్‌ ఏఈ లేకపోవడం ఇన్‌చార్జ్‌ విధులతో విద్యుత్‌ సమస్యలను పట్టించుకొనే వారే కరువయ్యారని, ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్‌ అంతరాయం కలుగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

మాటిమాటికి ట్రిప్పవుతున్న కరెంట్‌

అల్లాడుతున్న ప్రజలు

పట్టించుకోని అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement