ధాన్యం కొనుగోళ్లు వేగవంతమవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు వేగవంతమవ్వాలి

May 27 2026 6:20 AM | Updated on May 27 2026 6:20 AM

ధాన్యం కొనుగోళ్లు వేగవంతమవ్వాలి

పలు కొనుగోలు కేంద్రాల్లో కలెక్టర్‌ తనిఖీలు

స్టేషన్‌ఘన్‌పూర్‌: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. డివిజన్‌ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం, మండలంలోని నమిలిగొండ గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఆయనతో పాటు తహసీల్దార్‌ స్వప్న, అధికారులు, నిర్వాహకులు ఉన్నారు.

జఫర్‌గఢ్‌లో..

జఫర్‌గఢ్‌: రైతులకు ఇబ్బంది కలుగకుండా వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝూ నిర్వాహకులకు సూచించారు. మండలంలోని కూనూర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ దేవేందర్‌, అధికారులు ఉన్నారు.

ఓపీఎంఎస్‌లో నమోదు చేయాలి

జనగామ రూరల్‌: ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల వివరాలను ఓపీఎంఎస్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచించారు. కలెక్టరేట్‌లో మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో డీఆర్‌డీఓ భాస్కర్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం చంద్రశేఖర్‌, డీఎంఓ రామకృష్ణ, అదనపు డీఆర్‌డీఓ నూరుద్దీన్‌, సివిల్‌ సప్‌లై డీఎం హతీరామ్‌, డీసీఎస్‌ఓ సురేష్‌ రెడ్డి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌ గౌడ్‌, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ పాల్గొన్నారు.

భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో

వేగం పెంచాలి

భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌తో కలిసి వివిధ మండలాల తహసీల్దార్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌ దరఖాస్తుల ప్రక్రియపై కలెక్టర్‌ సమీక్షించి పలు సూచనలు చేశారు. సమావేశంలో ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement