బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత

May 27 2026 6:20 AM | Updated on May 27 2026 6:20 AM

కొడకండ్ల: బాల్య వివాహాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత అని తహసీల్దార్‌ ఉత్తలూరి అనీల్‌బాబు అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్‌ మాట్లాడారు. ఎంపీడీఓ శంకర్‌, సీడీపీఓ విజయచంద్రిక, సర్పంచ్‌ దూలం మమతసతీష్‌గౌడ్‌, సూపరువైజరు సరళ, రేణుక, ఇందిర పాల్గొన్నారు.

బాల్య వివాహాలు చట్ట విరుద్దం

నర్మెట: బాల్య వివాహాలు చట్టవిరుద్దమని ఎస్సై నైనాల నగేష్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు శృతి, సునీతా దేవి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాల సందర్భంగా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం నర్మెట గ్రామ పంచాయతీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బాల్య వివాహాల నిర్మూలన–తెలంగాణ అంశంపై ఏర్పాటు అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేసి కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గోపగోని శ్రీధర్‌ గౌడ్‌, ఎంఈఓ మడిపల్లి ఐలయ్య, ఎంపీఓ ఆకుల వెంకట మల్లికార్జున్‌, ఏఎన్‌ఎం కుల్సుం సుల్తానా, సీహెచ్‌సీడబ్ల్యూ ప్రశాంత్‌, ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ మనోజ్‌ కుమార్‌, కార్యదర్శి ఎండి.ఖాజా నసీరొద్దీన్‌ పాల్గొన్నారు.

పిల్లల భవిష్యత్‌ను దెబ్బతీసే

బాల్య వివాహాలు చేయొద్ధు

చిల్పూరు: పిల్లల భవిష్యత్‌ను దెబ్బతీసే బాల్యవివాహాలు చేయవద్ధని, అలా చేసినట్లు తెలిస్తే చర్యలు తప్పవని తహసీల్ధార్‌ విజయ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్‌ నలిమెల అనిత ఆధ్వర్యంలో ఐసీడీఎస్‌ మండల సూపర్‌ వైజర్‌ దూలమ్మ అధ్యక్షతన బాల్యం రక్షిద్ధాం.. భవిష్యత్‌ వెలిగిద్ధాం కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిర్యూలన వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఎంపీడీఓ రఘురామకృష్ణ, ఉపాధి హామీ ఏపీఓ మోహన్‌రావు, ఐకేపీ ఏపీయం పిట్టల నరేందర్‌, పంచాయతీ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్‌, కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

జఫర్‌గఢ్‌: బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించాలని ఎంపీడీఓ సుమన్‌, సర్పంచ్‌ కుల్లా మోహన్‌రావు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్‌ శ్రావ్య, కార్యదర్శి నాగరాజు, సూపర్‌ వైజర్‌ అనిత, అంగన్‌వాడీ టీచర్లు అమృత, రాజకళ, సోమలక్ష్మి, ఉమ, నాగమణి పాల్గొన్నారు.

బచ్చన్నపేట: బాల్య వివాహాలను నిషేధించాలని నయాబ్‌ తహసీల్దార్‌ శంకర్‌ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో సఖీ కేంద్రం సభ్యులు, మహిళలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అంగన్‌వాడీలు, ఆశాలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

అవగాహన

పాలకుర్తి టౌన్‌, పాలకుర్తి టౌన్‌(దేవరుప్పలు): ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాలను పురస్కరించుకొని పాలకుర్తి జీపీ, దేవరుప్పుల మండల కేంద్రాల్లో బాల్య వివాహాల నిర్మూలన–తెలంగాణ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న బాల్య వివాహ నిరోధక చట్టాలపై ప్రజలక అవగాహన కల్పించి కరప్రతలు పంపిణీ చేశారు. వాల్‌పోస్టర్లను ప్రదర్శించి ప్రతిజ్ఞ చేయించారు. పాలకుర్తి సర్పంచ్‌ కమ్మగాని విజయ, ఎంపీఓ శ్రీనాథ్‌రెడ్డి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ తాహేరా, మల్లీశ్వరి, దేవర్పుల సర్పంచ్‌ పెద్ది కృష్ణమూర్తి, కామారెడ్డి గూడెం సర్పంచ్‌ చింత రవి, మోన్‌పాడు సర్పంచ్‌ బాలమ్మ, దేవరుప్పల ఎస్సై సృజన్‌కుమార్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌లు సావత్రి, శ్రీదేవి, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కో ఆర్డినేటర్‌ రవికుమార్‌, ప్రణయ్‌కుమార్‌, పుష్పలత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement