స్టేషన్‌ఘన్‌పూర్: ప్రస్తుత వేసవికాలంలో జరిగే అగ్నిప్రమాదాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఫైర్‌స్టేషన్ ఎస్సై ఎన్.దేవేందర్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్ అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అగ్నిప్రమాదాల నివారణపై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, ఫైర్‌స్టేషన్ జమీందార్ కె.లింగయ్య, సిబ్బంది సతీష్, సాంబయ్య, నరేష్ పాల్గొన్నారు.


