జఫర్‌గఢ్: సనాతన ధర్మానికి వేదాలకు నిలయం భారత దేశమని శ్రీశ్రీశ్రీ శ్రీధర్ ఆనంద భారతి స్వామి, ప్రముఖ జర్నలిస్టు నవత అన్నారు. ఉప్పుగల్లు గ్రామంలో హిందూ మహా సమ్మేళన కార్యక్రమాన్ని సోమవారం రాత్రి నిర్వహించారు. ముందుగా హనుమాన్ శోభాయాత్రను చేపట్టారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి గడ్డం రాజుగౌడ్ అధ్యక్షత వహించగా వారు మాట్లాడారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. లక్ష్మణ్‌సుధాకర్‌జి, సర్పంచ్ కొడారి సాంబరాజు, ఉప సర్పంచ్ మధు, గ్రామస్తులు పాల్గొన్నారు.


