జనగామ రూరల్: ఆర్యవైశ్యలకు అరుగుల శ్రీనివాస్ చేసిన సేవలు మరువలేనివని పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి గట్టు వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోని ఆవోపా భవనంలో మంగళవారం అరుగుల శ్రీనివాస్ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ చేసిన సేవలను కొనియాడారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు పజ్జూరి గోపయ్య, పజ్జూరి జయహరి, బిజ్జాల నవీన్ కుమార్ సంపత్, శర్విరాల ఉపేందర్, తమ్మిశెట్టి మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.


