స్టేషన్‌ఘన్‌పూర్: నాయిబ్రాహ్మణ జనసంస్థ 9వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని బీసీ సాఽధికారత సంస్థ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రతిభాపురస్కారాలు–2026 కార్యక్రమంలో భాగంగా ఘన్‌పూర్ పట్టణ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కొలిపాక సతీష్‌కు ఉత్తమ పొలిటికల్ లీడర్ అవార్డును ప్రదానం చేశారు. సీపీఎం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ భారత ప్రభుత్వ సభ్యులు డాక్టర్ సారంగపాణి, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎల్.రాంబాబు, రాష్ట్ర సైకాలజిస్టు అసోసియేషన్ కార్యదర్శి సుధాకర్ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. నాయిబ్రాహ్మణ జనసంస్థ 9వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి అవార్డులను ప్రదానం చేశామని, అందులో భాగంగా 28 సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉంటూ నిస్వార్దంగా రాజకీయాల్లో రాణిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేసిన సతీష్‌కు అవార్డును అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ఉత్తమ పొలిటికల్ లీడర్‌గా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.


