నర్మెట: పచ్చిరొట్టతో భూసారం పెరిగి.. చేనుకు చేవయిస్తుందని మండల వ్యవసాయాధికారి అక్కిరెడ్డి కర్ణాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక పీఏసీఎస్‌లో మంగళవారం 50 శాతం సబ్సిడీలో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీలో భాగంగా జీలుగ విత్తనాలను సీఈఓ కొన్నె వెంకటయ్యతో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి రైతులు సేంద్రియ ఎరువులను వాడాలని భూసారం పెరుగడంతో పాటు సాగు వ్యయం తగ్గి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చన్నారు. పీఏసీఎస్‌తో పాటు ఆగ్రోస్ రైతు సేవాకేంద్రంలో విత్తనాలు అందు బాటులో ఉన్నాయని తెలిపారు. ఏఈఓ సుంకరి జగదీష్, సిబ్బంది ఐలేని కేశవరెడ్డి, వేముల శివ ఉన్నారు.
ఏఓ కర్ణాకర్ రెడ్డి


