ఆలయ భూముల వేలం ఆదాయం రూ.67 వేలు | - | Sakshi
Sakshi News home page

ఆలయ భూముల వేలం ఆదాయం రూ.67 వేలు

May 27 2026 6:02 AM | Updated on May 27 2026 6:02 AM

పాలకుర్తి టౌన్‌: మండలంలోని వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయ భూముల కౌలు కాస్తుకు వేలం ద్వారా ఆలయానికి రూ.67 వేల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో వల్మిడి ఆలయ భూములు కౌలుకు వేలం నిర్వహించారు. మండలంలోని గూడూరు సర్వే నంబర్‌ 639లో 1.34 ఎకరాలకు రూ.7,500, వల్మిడిలో సర్వేనంబర్‌ 499లో 2.13 ఎకరాలకు రూ. 13 వేలు, రాయపర్తి మండలం కేశవాపురం సర్వేనంబర్‌ 157, 158, 159లో 4.10 ఎకరాలకు రూ. 40వేలు, కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి సర్వే నంబర్‌ 180సీ, 380ఏ, 380ఏలో 2.35 రూ.6,500 ఆలయ భూముల కౌలు కాస్తుకు వేలం ద్వారా ఆదాయం వచ్చిన్నట్లు ఈఓ తెలిపారు. వేలం పాటలో కౌలు రైతులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement