పాలకుర్తి టౌన్: ప్రభుత్వం వెంటనే రైతులు సమస్యలను పరిష్కరించాలిన బీజేపీ రాష్ట్ర నాయకుడు లేగా రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని తొర్రూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రామ్మోహన్‌రెడ్డి సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గన్ని బ్యాగులు కొరత, తూకాల సమస్యలు, లాల ఆలసస్యం కారణంగా రైతులు నష్టపోతున్నారని తహసీల్దార్ సరస్వతికి వివరించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాగాల నవీన్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రంగు రాములు, పల్లె కుమార్, చింత సృజన్, దుంపల సంపత్ తదితరులు పాల్గొన్నారు.


