ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

May 26 2026 3:08 AM | Updated on May 26 2026 3:08 AM

జనగామ రూరల్‌: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలోని మెయిన్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా వేడుకల నిర్వహణపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అధికారులు అధికారులు సమన్వయంతో చేయాలని సూచించారు. వివిధ శాఖల తరపున స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని, ప్రముఖులకు, పుర ప్రముఖులకు, అతిథులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఆహ్వాన పత్రాలను అందజేయాలని, ప్రొటోకాల్‌ ను అనుసరించాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ గోపీరాం, కలెక్టరేట్‌ ఏఓ రవికిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జిల్లాకు చేరిన పాఠ్య పుస్తకాలు

పాఠశాలలు పునఃప్రారంభమయ్యే మొదటి రోజు ప్రతి విద్యార్థికి అందించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. జిల్లా పాఠశాల విద్యా గోదాంలో ఉన్న పాఠ్య పుస్తకాలను ఆయన సందర్శించారు. సోమవారం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..జూన్‌ 1వ తేదీ లోపు మొత్తం పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా లైబ్రరీని కలెక్టర్‌ సందర్శించి పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోటీ పరీక్షలకు కావాల్సిన మరిన్ని పుస్తకాలను అందుబాటులో పెట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జీసీడీఓ గౌసియా బేగం, సీఎంఓ నాగరాజు, విద్యాధికారులు శంకర్‌రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారం బక్రీద్‌ జరుపుకోవాలి

జనగామ రూరల్‌: నిబంధనలకు అనుగుణంగా బక్రీద్‌ పండుగను జరుపుకోవాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచించారు. కలెక్టరేట్‌లో డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి పశుసంవర్ధక శాఖ అధికారులు, హిందూ, ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధివిధానాలపై కలెక్టర్‌ సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో బక్రీద్‌ పండుగను విజయవంతంగా నిర్వహించుకునేలా ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు. డీసీపీ మాట్లాడుతూ.. జంతువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. సమావేశంలో డీవీహెచ్‌ఓ మురళీధర్‌ రావు, ఇతర అధికారులు, హిందూ, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement
 
Advertisement
Advertisement