నడక యాతన తప్పింది! | - | Sakshi
Sakshi News home page

నడక యాతన తప్పింది!

May 26 2026 3:08 AM | Updated on May 26 2026 3:08 AM

దివ్యాంగుడికి మూడు చక్రాల

స్కూటీ అందజేత

జనగామ రూరల్‌: కలెక్టరేట్‌ ప్రజావాణిలో ఓ దివ్యాంగుడు చేసిన వినతిని ‘సాక్షి’ ప్రచురించడంతో జిల్లా యంత్రాంగం స్పందించింది. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో సదరు దివ్యాంగుడికి ఉచితంగా మూడు చక్రాల మోటరైజ్డ్‌ స్కూటీ అందించారు. జిల్లా కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన కంకల రాజమల్లయ్యకు చిన్నతనంలో పోలియో రాగా ప్రమాదంలో కుడి కాలు పోయింది. దీంతో నడవడానికి చాలా ఇబ్బందులు పడేవాడు. అతడి పరిస్థితిపై ‘సాక్షి’ లో ‘మూడు చక్రాల స్కూటీ అందించండి’అనే వార్తను ప్రచురించగా అతడి అర్జీని అధికారులు పరిశీలించి, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజమల్లయ్యకు మూడు చక్రాల మోటరైజ్డ్‌ స్కూటీని మంజూరు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌ కలెక్టరేట్‌లోని మెయిన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో రాజమల్లయ్యకు స్కూటీని అందజేశారు. రాజమల్లయ్య ఆనందం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌లతో పాటు సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement